మణికి క్షమాపణ చెప్పిన వర్మ - MicTv.in - Telugu News
mictv telugu

మణికి క్షమాపణ చెప్పిన వర్మ

February 17, 2018

ఐద్వా అధ్యక్షురాలు మణిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వర్మ ఎట్టకేలకు ఆమెకు క్షమాపణ చెప్పాడు. ఈ విషయమై ఈ రోజు పోలీసు విచార‌ణకు వర్మ హాజరైన విషయం తెలిసిందే.  విచారణ అనంతరం ఓ ప్రైవేట్ టీవీ ఛానల్లో పాల్గొన్న వర్మ ఆమెకి క్షమాపణ చెప్పారు. ‘ జీ ఎస్టీ 2 నీతోనే తీస్తాను ’ అన్న వర్మ అదే టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఆమెకు మీడియా ముఖంగా సారీ చెప్పారు.

‘ ఆ మ‌ణి అనే ఆవిడ ఎవ‌రో నాకు నిజంగా తెలియ‌దు. జీఎస్టీపై మాట్లాడుతూ ఆ స‌మ‌యంలో నేను అలా అనుకోకుండా అని ఉండొచ్చ.  స‌హ‌జంగా నేను హ్యూమ‌ర‌స్ త‌ర‌హాలో మాట్లాడతాన‌ు. నా మాటల వల్ల ఆమెకు, ఆమె కుటుంబ సభ్యుల వల్ల ఎలాంటి ఇబ్బంది కలిగినా సారీ చెప్తున్నాను. అనుకోకుండానే నేనలా మాట్లాడాను తప్పితే కావాలని ఆమెను నేను టార్గెట్ చెయ్యలేదు ’ అని  అన్నారు. 
కాగా వర్మ సారీపై మణి స్పందించారు. ‘ వర్మ క్షమాపణలను నేను ఒప్పుకోను. వర్మకు సెలెబ్రిటీనని, అతణ్ణి ఎవరూ ఏమీ చెయ్యరని తలబిరుసుతనం వుంది. అతనికి చ‌ట్ట‌ప్ర‌కారం ఎటువంటి శిక్ష ప‌డాలో అటువంటి శిక్ష ప‌డాల‌ి. మహిళలను కించపరిచేవారికిది కనువిప్పు కావాలని ’  ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.