మోడీ పెద్ద దొంగ...కేసీఆర్ చిన్న దొంగ ! - MicTv.in - Telugu News
mictv telugu

మోడీ పెద్ద దొంగ…కేసీఆర్ చిన్న దొంగ !

February 27, 2018

ఉత్తమ్ కుమార్ రెడ్డి తలపెట్టిన కాంగ్రెస్ ప్రజాచైతన్య యాత్ర సంగారెడ్డికి చేరింది. అయితే సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన మీటింగ్ లో కాంగ్రెస్ నేత హనుమంతరావ్ మాట్లాడుతూ ‘కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ ఫామిలీ ఇప్పుడు బిక్షమెత్తుకునేది. కేసీఆర్ ..నీకొడుకు నోరును జాగ్రత్త పెట్టుకో… ఎన్నికల కోసమే కేసీఆర్ రైతులకు భీమా అంటున్నాడు ఖమ్మంలో రైతులకు బేడీలు వేసి ..ఇప్పుడేమో ముసలి కన్నీరు కారుస్తున్నారు. కేసీఆర్ పేదలకు ఇండ్లు కట్టించడు ..ఆయన మాత్రం బంగ్లా కట్టించుకున్నాడు. మోడీ పెద్ద దొంగ  అయితే కేసీఆర్ చిన్న దొంగ’ అని  హనుమంతరావ్ అన్నారు.