తెలుగు మహాసభలా?లేక కేసీఆర్ కుటుంబ మహాసభలా? - MicTv.in - Telugu News
mictv telugu

తెలుగు మహాసభలా?లేక కేసీఆర్ కుటుంబ మహాసభలా?

December 18, 2017

హైదరాబాద్‌లో జరుగుతున్నవి ప్రపంచ తెలుగు మహాసభలా? లేక కేసీఆర్ కుటుంబ మహాసభలా? ఈ మాటన్నది ఎవరో కాదు కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావ్. విహెచ్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్రంగా మండిపడ్డారు. ‘అమరావతి శంకుస్థాపనకు చంద్రబాబు.. కేసీఆర్‌ను ఆహ్వానించారు. కానీ ప్రపంచ తెలుగు మహాసభలకు కేసీఆర్ చంద్రబాబును ఎందుకు ఆహ్వానించలేదు? కనీసం తెలంగాణలోని ప్రతిపక్షనేతలు కూడా రమ్మనలేదు.ఏ ఏందుకు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగువాడు కాదా? ప్రతిపక్షనేతలు తెలుగు వారిలెక్క కనిపించడంలేదా?” అంటూ  కేసీఆర్ పై  హనుమంతరావ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.