ఏడ్చేసిన వీహెచ్.. అబద్ధాలు రాస్తున్నారని.. - MicTv.in - Telugu News
mictv telugu

ఏడ్చేసిన వీహెచ్.. అబద్ధాలు రాస్తున్నారని..

April 13, 2018

తనపై తప్పుడు కరపత్రాలు ప్రచురించిన వారిపై పరువునష్టం దావా వేస్తానని సీనియర్ కాంగ్రెస్ నేత వి. హనుమంత రావు  అన్నారు. తనపై వస్తున్న తప్పుడు కథనాలపై ఆయన  చలించిపోయారు. సోషల్ మీడియాలో తనపై ఇంత నీచపువార్తలు ఎందుకు రాస్తున్నారో అని కంటతడి పెట్టుకున్నారు. శుక్రవారం మీడియాతో మట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు.‘నేను ఏడుగురు గ్రేటర్ నేతలను విమర్శిస్తూ కరపత్రాలు ప్రచురించాను. దానిమీద పత్రికలలో అసత్య వార్తలు రాశారు. నామీద తప్పుడు వార్తలు రాసే ముందు కాస్త ఆలోచించి నిజాలు రాయండి. కాంగ్రెస్‌ నేతలపై వార్తలు రాసే మీడియా.. కేసీఆర్‌ ఇంటి గొడవలపై ఎందుకు వార్తలు రాయరు ? నేను పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశాను. పార్టీ కోసం ఎంతో శ్రమించాను. నా రాజకీయ జీవితంలో ఎంతోమంది కొత్త లీడర్లను తయారు చేశాను’ అని బావురుమన్నారు. తానెప్పుడూ బీసీలకు వ్యతరేకం కాదు. అనవసరంగా నన్ను బీసీ వ్యతిరేకినని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తన ప్రతిష్ఠను దిగజార్చడం వల్ల వారికి ఏం లాభమో అర్థం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  సొంత పార్టీ నేతలే ఒకరిపై మరొకరు కరపత్రాలు ప్రచురించడం పార్టీకే నష్టం అంటూ హెచ్చరించారు. ఈ కరపత్రాలపై వార్తలు రాసిన వారిపై ప్రెస్‌ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.