బాధితుడి పక్షాన నిలిచిన మామీదే కేసులు పెడతారా ? - MicTv.in - Telugu News
mictv telugu

బాధితుడి పక్షాన నిలిచిన మామీదే కేసులు పెడతారా ?

October 5, 2018

అధికారం చేతిలో వుందని ఎంత చేసినా చెల్లుతుంది అనుకుంటున్నారు కొందరు. రాజకీయాల్లో వున్న తమ నేతను చూసుకుని వారి బంధువులు కొందరు బలుపు చూపిస్తుంటారు. దళిత విద్యార్థిపై కుక్కను ఉసిగొల్పి అతని ప్రాణం తీసిన రాష్ట్ర హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తమ్ముడు భార్యను ఇంతవరకు అరెస్ట్ చెయ్యలేదు. పైగా బాధిత కుటుంబానికి అండగా నిలుస్తున్న బీఎస్సీ నాయకులపై ఉల్టా కేసులు పెడుతున్నారని బీఎస్పీ ఏపీ అధ్యక్షుడు పట్టపు రవి అన్నారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

Will the cases sit on the side of the victim.

సెప్టెంబర్ 28న అమలాపురంలోని హౌసింగ్ కాలనీలో ఆడుకునేందుకు దళిత విద్యార్థి ఎన్.వరుణ్ వెళ్ళాడు. ఆ సమయంలో హోంమంత్రి మరదలు పెంపుడు కుక్కను వరుణ్ మీదకు ఉసిగొల్పిందన్నారు. తరుముకొస్తున్న కుక్కను తప్పించుకునే క్రమంలో వరుణ్ పక్కన వున్న ఎర్ర కాలువలో పడి మృతిచెందాడని వాపోయారు.

ఈ ఘటన జరిగి వారం గడిచిపోయినప్పటికీ ఇంతవరకు నిందితుల మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. పోలీసులు కూడా స్పందించకపోవడం విచారకరం అన్నారు. అధికారం చేతిలో వుంది కదా అని ఎలా ప్రవర్తించినా చెల్లుతుంది అనుకునేవాళ్ళకు బుద్ధి చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. విద్యార్థి మృతికి కారణమైన మహిళను 2 రోజుల్లో అరెస్టు చేయని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.