పార్వతికి త్రిశూలాన్ని ఎందుకిచ్చారు?

జపాన్‌కు చెందిన డిలైట్ వర్క్ సంస్థ  రూపొందించిన ‘ఫేట్ గ్రాండ్ ఆర్డర్’ ఆన్‌లైన్ వీడియో గేమ్‌పై ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సంఘాలు కన్నెర్రజేస్తున్నాయి. ఇందులో పార్వతి దేవిని పనిమనిషిగా చూపారని, ఆమెతో అసభ్య డ్యాన్సులు వగైరా చేయించి తమ మనోభావాలను గాయపరిచారని మండిపడుతున్నారు. గేమ్‌లో పార్వతి పాత్రను తొలగించాలని సదరు కంపెనీకి లేఖ కూడా రాశామని  యూనివర్సల్ హిందూ సొసైటీ అధ్యక్షుడు రాజన్ జెడ్  చెప్పారు. ‘ఈ గేమ్‌లో పార్వతిదేవిని పనిమనిషిగా చూపించడం కాక, ఆమె రూపురేఖలు దారుణంగా, అసభ్యకరంగా మార్చేశారు.  హిందూ దేవతలను చూపించడాన్ని మేం వ్యతిరేకించడం లేదు. కానీ ఇలా తప్పుగా చూపెట్టొద్దు. త్రిశూలం ఈశ్వరుడి చేతిలో ఉంటుంది. అయితే దాన్ని గేమ్ ‌ పార్వతి చేతిలో పెట్టారు. అలాగే శివుడి వాహనమైన నందిని పార్వతికి ఇచ్చారు.  పార్వతిని బెల్లీ డ్యాన్సన్‌గా చిత్రికరించారు..’ అని ఆరోపించారు. ఇటీవల ఆస్ట్రేలియన్ కంపెనీ ఒకటి మాంసోత్పత్తుల ప్రచారం కోసం గణేశుడు మాంసాహార విందులో పాల్గొన్నట్టు చూపడం వివాదానికి దారితీయడం తెలిసిందే.

SHARE