టాయిలెట్లో కెమెరాలు..హోటల్‌పై 700 కోట్ల దావా

హిల్టన్ హోటల్స్ అండ్ రిసార్ట్స్.. 5,500లకు పైగా బ్రాంచులు, 570 ప్రదేశాల్లో ఉన్న ఈ సంస్థ హోటళ్లకు  ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుంది. అయితే కస్టమర్లకు చేసే సేవలు మాత్రం పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుంది.

ఈ హోటల్ యాజమాన్యంపై  ఓ మహిళ 100 మిలియన్ డాలర్లకు (రూ.700 కోట్ల) దావా వేసింది. తాను హోటల్ గదిలో స్నానం చేస్తుండగా సీసీ కెమెరాలో రికార్డు చేసి, ఆ వీడియోను ఇంటర్‌నెట్‌లో పోస్టు చేశారని బాధిత మహిళ ఆరోపించింది. మూడేళ్ల క్రితం జరిగిన ఈ ఘటన బాధితురాలు ఈ మధ్యే తెలుసుకుంది. దీంతో వెంటనే తనకు న్యాయం చేయాలంటూ ఈ మహిళ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. Telugu News Video Of Woman Secretly Recorded In Hilton Hotel Shower Ends Up On Porn Sites2015 జులైలో షికాగోకు చెందిన ఓ మహిళ బార్ పరీక్షల కోసం న్యూయార్క్ వెళ్లింది. అక్కడి అల్బనీలోని హాంప్టన్ ఇన్ అండ్ సూట్స్ హోటల్‌లో ఓ గది అద్దెకు తీసుకుంది. అనంతరం గదిలోకి వెళ్లిన సదరు మహిళ స్నానం చేస్తుండగా సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ఇది తెలియని సదరు మహిళ షికాగో వెళ్లిపోయింది. ఈ ఘటన జరిగి మూడేళ్లు అయ్యింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆ మహిళకు ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి ఈ-మెయిల్‌ వచ్చింది. ‘ఈ వీడియోలో ఉన్నది మీరే కదా’ అంటూ అశ్లీల వెబ్‌సైట్ లింక్‌ను పంపించాడు. అంతేకాదు తనకు పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వాలని, లేకపోతే ఆ వీడియోను ఇతర సైట్లలో కూడా పోస్టు చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో తీవ్ర దిగ్బ్రాంతికి గురైన బాధిత మహిళ కోర్టును ఆశ్రయించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని హిల్టన్ హోటళ్లపై 100 మిలియన్ డాలర్లకు దావా వేశారు.

దీనిపై హిల్టన్ గ్రూప్ స్పిందించింది.. ‘హోటల్ కు వచ్చే అతిథుల భద్రత, ప్రైవసీపై తాము సీరియస్ గా ఉంటాం. ఈ ఘటనకు కారణమైన వారికి కఠిన శిక్ష పడేలా మేము పోలీసులకు అన్ని విధాలా సహకరిస్తాం’ అని హామీ ఇచ్చారు.