వాట్సాప్‌లోనే వీడియోలు చూడొచ్చు.. కొత్త ఫీచర్..

పోటీ ప్రపంచంలో దూసుకుపోతోంది టెక్నాలజీ. ఆ టెక్నాలజీ యూజర్లకు కొత్త కొత్త ఫీచర్స్‌ను పరిచయం చేస్తోంది. ఆన్‌లైన్ యాప్స్ వ్యాపారం అయిపోయింది. ఆన్‌లైన్ మార్కెట్లో యాప్స్‌కు భలే గిరాకి వుంది. ఉన్న యాప్స్‌లో సరికొత్త ఫీచర్లను ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా వాట్సాప్ తన వినియోగదారులను ఆకట్టుకోవడానికి మరింత అప్‌డేట్ అవుతోంది. ఇప్పటికే అందులో కొత్త కొత్త ఆప్షన్స్ వచ్చాయి. ఇప్పుడు మరో ఆప్షన్‌ను తీసుకువస్తోంది వాట్సాప్. అదే  ‘పిక్చర్‌ ఇన్‌ పిక్చర్‌’ (పీఐపీ) మోడ్‌ ఆప్షన్.

Telugu news Videos can be found in Watsapp .. new feature ..

ఈ యాప్‌లోనే యూట్యూబ్ వీడియోలు చూసే సౌకర్యం కల్పించనుంది. అదీ నోటిఫికేషన్‌ వచ్చిన సమయంలోనే ప్రివ్యూ చూసే విధంగా మార్పులు చేస్తోంది. ఇంతకు ముందు ఎవరైనా వీడియో పంపిస్తే దాన్ని క్లిక్ చేస్తే యూట్యూబ్‌లోకి వెళ్లి చూస్తాం. కానీ ఇప్పుడు ఈ కొత్త ఆప్షన్ వల్ల వాట్సాప్‌లోనే వీడియో ఓపెన్ చేసి చూడొచ్చు. ప్రస్తుతం ఇది అందుబాటులోకి కూడా వచ్చింది.

అయితే ఇందులో క్వాలిటీని మార్చుకునే అవకాశం లేదు. ఈ ఫీచర్‌కు సంబంధించిన వాట్సాప్‌ ఐఓఎస్‌ వెర్షన్‌ త్వరలోనే అందుబాటులోకి రానుందని సమాచారం. ఇన్‌స్టాగ్రామ్‌ తరహాలో కాంటాక్ట్స్‌ను సేవ్‌ చేసుకోవడం కోసం క్యూఆర్‌ కోడ్‌ను వాట్సాప్‌ త్వరలో ప్రవేశపెట్టననున్న విషయం తెలిసిందే.

దీనిని ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే…  

వాట్సాప్‌ బేటా యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలంటే.. గూగుల్‌ ప్లే స్టోర్‌లోకి వెళ్లి వాట్సాప్‌ను సెర్చ్‌ చేయాలి. అప్పుడు ‘బికమ్‌ ఎ బేటా టెస్టర్‌’ అనే అప్లికేషన్‌ వస్తుంది. దాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఇన్‌స్టలేషన్‌ పూర్తికాగానే యూట్యూబ్‌ యాప్‌ను ఓపెన్‌ చేయాలి.

Telugu news Videos can be found in Watsapp .. new feature ..