‘అర్జున్ రెడ్డి’ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ, ఇండస్ట్రీలో పరిచయాలు పెంచుకోవడానికి జోరుగా పార్టీలు ఇస్తున్నాడు.
ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్న విజయ్‌కు, తెలుగు ఇండస్ట్రీలో పరిచయాలు ఎక్కువ లేకపోవడంతో, అందరకిీ పార్టీలు ఇచ్చి పరిచయం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో చాలా మంది తెలుగు హీరోలు, విజయ్‌కి స్నేహితులు అయిపోయారు.
లెక్కకైతే ఈ విధానం హిందీ సినిమా వాళ్లది. బాలీవుడ్లో ఎవరైనా కొత్త హీరో వస్తే. గ్రాండ్ గా పార్టీలు ఇచ్చి అందరితో స్నేహం ఏర్పరుచుకుంటారు, విజయ్ దేవరకొండ ఇప్పుడదే ట్రెండ్‌ను ఫాలో అవుతున్నట్టున్నాడు. అంతే కాదు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న పెద్ద పెద్ద నిర్మాతలను కూడా మచ్చిక చేసుకుని స్నేహం చేస్తున్నాడట.