విక్రమ్ ఇంట్లో ‘అర్జున్ రెడ్డి’ - MicTv.in - Telugu News
mictv telugu

విక్రమ్ ఇంట్లో ‘అర్జున్ రెడ్డి’

October 27, 2017

‘అర్జున్ రెడ్డి’ హీరో విజయ దేవరకొండకు తమిళ హీరో విక్రమ్ పోన్ చేసి మరీ అభినందించాడు. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ నటనకు తాని ఫిదా అయినట్టు తెలిపాడు. స్క్రీన్ మీద నటుడు గాకుండా ఒక పాత్ర మాత్రమే కనిపించిందని, చాలా చక్కటి పర్‌ఫార్మెన్స్ చేశావని ఒకటికి పదిసార్లు ప్రశంసించాడు. తన ఇంటికి వచ్చి మా కుటుంబంతో ఒకరోజు స్పెండ్ చెయ్యమని రిక్వెస్ట్ చేశాడు. అన్నదే తడవుగా విజయ్ చెన్నై చెక్కేసి ఒకరోజు మొత్తం విక్రమ్ ఇంట్లోనే గడిపాడు. విక్రమ్ కొడుకు ధ్రువ్‌తో అర్జున్ రెడ్డి సినిమాను రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై విక్రమ్.. విజయ్ తో గంటల తరబడి మాట్లాడట. అర్జున్ రెడ్డి బాడీ లాంగ్వేజ్ గురించి చాలా చిట్కాలు విజయ్ ధ్రవ్‌కు చెప్పాడట. బాడీ ఫిట్‌నెస్ గురించిన సీక్రెట్స్ కూడా విజయ్ షేర్ చేసుకున్నాడట.

విజయ్‌కి కూడా స్వతహాగా విక్రమ్ నటనంటే చాలా ఇష్టమని, తను విక్రమ్‌కు ఫ్యాన్‌నని చెప్పాడు. ఒక రోజంతా విక్రమ్ ఇంట్లోనే గడిపి వచ్చాడు విజయ్. ధ్రవ్ కూడా విజయ్ నుండి చాలా విషయాలు నేర్చుకున్నట్టు సమాచారం. త్వరలోనే తమిళ అర్జున్ రెడ్డి సినిమా మొదలు కానున్నది.