బిచ్చగాడుగా ‘అర్జున్ రెడ్డి’ ? - MicTv.in - Telugu News
mictv telugu

బిచ్చగాడుగా ‘అర్జున్ రెడ్డి’ ?

September 15, 2017

అర్జున్ రెడ్డి మూవీతో  భారీ విజయాన్ని సాధించిన విజయ్ దేవరకొండ , ఆ సక్సెస్ ను తను క్యాష్ చేసుకునే పనిలో ఉన్నాడని అంటున్నారు సినీ విశ్లేకులు. అర్జున్ రెడ్డి మూవీతో సౌత్ లోని ఇతర ఇండస్ట్రీల దృష్టిలో పడిన విజయ్.  త్వరలో కన్నడ లో ఓ మూవీ చేయబోతున్నాడట. పుట్టపర్తిలో చదువుకున్న విజయ్ కి కన్నడ భాష మీద మంచి పట్టు ఉండడంతో  త్వరలో కన్నడ హీరోగా ఏంట్రీ ఇవ్వడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే తమిళ, తెలుగు భాషలలో సంచలనం సృష్టించిన ఓ తమిళ సినిమాను రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడట విజయ్. చిన్న సినిమా గా విడుదలై తెలుగు, తమిళంలో ఘనవిజయం సాధించిన బిచ్చగాడు మూవీని కన్నడంలో రీమేక్ చేసేందుకు రెడి అవుతున్నాడని సమాచారం. అయితే విజయ్ దీనిపై ఎలాంటి ఎనౌన్స్ మెంట్ చెయ్యలేదు.  త్వరలోనే ఆ ప్రాజెక్ట్ పై క్లారిటిీ వచ్చే అవకాశం ఉంది.