విజయ్ దేవరకొండను ట్రోల్ చేసిన నెటిజన్లు - MicTv.in - Telugu News
mictv telugu

విజయ్ దేవరకొండను ట్రోల్ చేసిన నెటిజన్లు

April 24, 2018

హీరో విజయ్ దేవరకొండ  మరో వివాదంలో ఇర్కుకున్నాడు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో చాలా వివాదాలను ఎదర్కున్న ఆయనకు ఈ వివాదాలు కొత్తమేమి కాదు. తాజాగా ఆయన ‘మహానటి’ పోస్టర్‌ను తన ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ‘ వాట్ ఏ కూల్ చిక్ ’ అని ట్వీట్  పెట్టాడు. చిక్ అనే పదానికి అర్ధం ‘యంగ్ అండ్ బ్యూటిఫుల్ ఉమెన్ ’ అని . కానీ ఆ పదం కాస్త నెటిజన్లకు వేరేలా అర్ధమై విజయ్‌ని విమర్శిస్తున్నారు. ‘చిక్ ఏందిరా అరై.. సీనియర్లకు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వు’ అని ఒకరు… ‘చిక్ అంటే దవడలు పగులుతాయి.. బోల్డ్‌గా ఉండటం అంటే ప్రతి ఒక్కరినీ బూతులు మాట్లాడటం కాదు. బోల్డ్ అంటే నిర్భయంగా నిజాలు మాట్లాడటం’ అని మరొకరు ఇలా చాలా సీరియస్‌గా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఈ విషయంపై నెటిజన్లకు విజయ్  ధీటుగా బదులిచ్చాడు….‘ఆమె చాలా విషయాల్లో నిర్భయంగా.. దయా గుణం కలిగి సాధారణ మహిళగా ఉండేది. అందరు అమ్మాయిల్లాగే ఆమెకు కలలుండేవి. ప్రతి ఒక్కరినీ ప్రేమించే మనస్తత్వం.. ప్రేమించబడటం అనేది తరువాత. లేడీ సూపర్ స్టార్ అనేది చివర ఉండేది. క్షమాపణ కోరుకునే వాళ్లంతా చెన్నై లీలా ప్యాలెస్‌లో ఉన్నా వచ్చేయండి. నేను మహానటి ఆడియో లాంచ్ ఎంట్రీలు కూడా ఇస్తాను. ఆమె మిమ్మల్ని చూస్తే చాలా సంతోషిస్తుంది. ఎందుకంటే మీ లాంటి నైతిక విలువలు ఉన్నవాళ్లూ.. నీతిమంతుల బ్యాచ్ అంతా ఆమెను నానా రకాలుగా అన్నారు.. ఆమె కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకుందని.. తాగుబోతు అని పిలిచారు. ఆమె కుటుంబాన్ని పాడు చేసుకుంది అనే కామెంట్లతో పోలిస్తే నేను ‘వాట్ ఏ కూల్ చిక్’ అన్నందుకు ఆమె చాలా సంతోషించి ఉంటారు’అని విజయ్ ట్వీట్ చేశారు.