ప్రభాస్‌ను మించిపోయిన విజయ్

విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ మూవీతో స్టార్ డమ్ తెచ్చేసుకున్నాడు. ఈ సినిమా యూత్ నాడిని ఒడిసిపట్టుకుంది. లక్షలాది మందికి ఫేవరెట్ హీరోగా నిలిచాడు విజయ్. విజయ్ ఆన్‌లైన్  పోల్స్‌లోనూ కూడా సత్తా చాటుతున్నాడు. తాజాగా హైదరాబాద్ టైమ్స్ నిర్వహించిన ‘మోస్ట్ డిజైరబుల్ మెన్ 2017’ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. టాలీవుడ్ టాప్ హీరోలైన ప్రభాస్‌, మహేశ్ బాబు, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, రానా, ఎన్టీఆర్‌ లాంటి హీరోలకు కూడా వెనక్కి నెట్టి రెండో స్థానంలో నిలిచాడు.పలు టీవీ రియాలిటీ షోలలో పాల్గొన్న బషీర్ అలీ తొలి స్థానంలో నిలిచాడు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏకంగా 20 స్థానాలు ముందుకు దూసుకొచ్చాడు. తరువాతి స్థానాల్లో వరుసగా ప్రభాస్‌, మహేష్‌ బాబు, రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌, రానా దగ్గుబాటిలతో ఇతర టాలీవుడ్ స్టార్‌లు ఉన్నారు.