‘ఏ వేళ చూసానో కాని’ అంటున్న విజయ్... - MicTv.in - Telugu News
mictv telugu

‘ఏ వేళ చూసానో కాని’ అంటున్న విజయ్…

February 28, 2018

‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘ఏ మంత్రం వేసావే’ చిత్రంతో మార్చి 9న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన తొలిపాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘ఏ వేళ చూసానో కాని ’అంటూ సాగే పాట అభిమానులను విశేషంగా  ఆకట్టుకుంటోంది.

 శ్రీధర్ మర్రి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని గోలీసోడా ఫిలింస్ ప్రొడక్షన్ బేనర్‌పై తీస్తున్నారు. కథానాయకగా శివాని సింగ్ నటిస్తోంది. విజయ్ మరోవైపు ‘టాక్సీవాలా’ అనే  చిత్రంలోనూ నటించనున్నాడు. అలాగే గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్‌లో  సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ తెరకెక్కిస్తున్నాడు.