వర్మతో మూవీకి నో చెప్పిన విజయ్ - MicTv.in - Telugu News
mictv telugu

వర్మతో మూవీకి నో చెప్పిన విజయ్

March 14, 2018

అర్జున్ రెడ్డి’ సినిమాతో దక్షిణాదిలో అందరికీ తెలసిపోయి స్టార్ హీరోల సరసన చేరాడు విజయ్ దేవరకొండ. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో అతనికి చక్కని సంబంధాలే ఉన్నాయి. అర్జున్ రెడ్డి మూవీకి వర్మ విపరీతంగా ప్రచారం చేయడం తెలిసిందే.

దాంతో ఇద్దరూ కలసి హోటళ్లలో కలసిమెలసి భోంచేయడం దాకా వెళ్లింది ఫ్రెండ్ షిప్. ఈ సాన్నిహిత్యంతోనే విజయ్‌తో ఓ సినిమాను తెరకెక్కించేందుకు వర్మ ప్లాన్ చేశాడు. అయితే విజయ్ వర్మ సినిమాకు నో చెప్పాడని టాక్. తన డేట్స్ అడ్జస్ట్  చేయలేకపోవడమే ఇందుకు కారణం అంట.

ప్రస్తుతం విజయ్  చేతినిండా సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. రాహుల్ సంక్రిత్యాన్  దర్శకత్వంలో ట్యాక్సీవాలా మూవీలో నటిస్తున్నాడు. అలాగే ‘మహానటి ’ సినిమా చిత్రీకరణలో కూడా పాల్గొంటున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత  తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ‘నోటా’ చిత్రికరణలో పాల్గొంటాడు. దీని కోసం అతడు తమిళం నేర్చకుంటున్నాడు.