mictv telugu

ఫోర్బ్స్ జాబితాలో అర్జున్ రెడ్డికి చోటు

December 5, 2018

ఈ ఏడాది అత్యధిక రాబడి పొందిన సెలబ్రిటీల జాబితాను ప్రముఖ ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసింది. మొత్తం 100 మందితో కూడిన ఈ జాబితాలో 14 కోట్ల సంపాదనతో తెలుగు చిత్రసీమ యువ సంచలనం విజయ్ దేవరకొండ 72 వ స్థానంలో నిలిచారు.

విజయ్‌తో పాటు… పవన్ కళ్యాణ్ (31.33 కోట్లు), తమిళ హీరో విజయ్ (30.33 కోట్లు), జూనియర్ ఎన్టీఆర్ (28 కోట్లు), విక్రమ్ (26 కోట్లు), మహేష్ బాబు (24.33), సూర్య (23.67 కోట్లు), విజయ్ సేతుపతి (23.67 కోట్లు) , నాగార్జున (22.25కోట్లు), కొరటాల శివ (20 కోట్లు), ధనుష్ (17. 25 కోట్లు), నయన తార (15.17కోట్లు), అల్లు అర్జున్ (15 కోట్లు), రామ్ చరణ్ (14కోట్లు ) తరువాతి స్థానాల్లో చోటు సంపాదించారు.జాబితా వివరాలు..

సల్మాన్ ఖాన్, విరాట్ కోహ్లీ, అక్షయ్ కుమార్‌లు.. 253.25 కోట్లు, 228.09 కోట్లు, 185 కోట్లతో మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. నాలుగవ స్థానంలో 112.8 కోట్లతో దీపికా పదుకొనే నిలవడం గమనార్హం. 100 మందితో కూడిన మొత్తం జాబితాలో 18 శాతం మహిళలే ఉండడం విశేషం. సంగీత సామ్రాట్ రహమాన్ 66.75 కోట్లతో 11 వ స్థానంలో నిలిచారు.

http://www.forbesindia.com/lists/2018-celebrity-100/1735/1