అర్జున్ రెడ్డి రాజకీయ ప్రవేశం.. - MicTv.in - Telugu News
mictv telugu

అర్జున్ రెడ్డి రాజకీయ ప్రవేశం..

March 5, 2018

‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో కుర్రహీరో విజయ్ దేవరకొండకు మంచి గుర్తింపు వచ్చింది. దాంతో అతడు రెట్టించిన ఉత్తేజంతో  కొత్త కథలను ఎంచుకుంటూ వరసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. విజయ్ తెలుగుతోపాటుగా తమిళంలోనూ జోరు పెంచేస్తున్నాడు. మణిరత్నం సినిమాలో ఆఫర్ కొట్టేసినట్లు ఇటీవల వార్తలు రావడం తెలిసిందే.

ఆ సంగతి ఇంతవరకు నిర్ధారణ కాలేదు. అయితే విజయ్ మరో అరవ సినిమా చేస్తున్నారు. విజయ్ ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ  సినిమా చిత్రీకరణ ఈ రోజు హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తమిళంతోపాటు తెలుగులోనూ నిర్మితం అవుతున్న ఈ చిత్రాన్ని జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నాడు. ఇది పక్కా రాజకీయ సినిమా అని తెలుస్తోంది. ఎత్తులకు పైఎత్తులు ఉంటాయట. ఈ సినిమాలో విజయ్ రాజకీయ నాయకుడి వారసుడిగా ఎంట్రీ ఇచ్చి, రాజకీయ ప్రత్యర్థులను ఆటాడించి ప్రజలకు మేలు చేసేలా చూపుతారట. రొమాన్స్, ఫైట్లు వంటి రొటీన్ సీన్లు కూడా ఉన్నా సినిమా యువతను ఆలోచింపజేస్తుందని చెబుతున్నారు.