విజయ్ క్రైస్తవుడు కాదు భారతీయుడు - MicTv.in - Telugu News
mictv telugu

విజయ్ క్రైస్తవుడు కాదు భారతీయుడు

October 24, 2017

విజయ్ నటించిన ‘మెర్సల్’ సినిమాపై పలు వివాదాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే విజయ్ క్రిస్టియన్ కాబట్టే  హిందువులను కించపరిచేలా ‘మెర్సల్’ సినిమాలో కొన్ని డైలాగులు చెప్పాడని  బీజేపీ నాయకులు మండిపడ్డారు.

అయితే దీనిపై విజయ్ తండ్రి చంద్రశేఖర్ స్పందిస్తూ..‘నా కొడుకును జోసఫ్ విజయ్ అని పిలుస్తున్నారు. ఆ పేరులో తప్పేముంది?  నాపేరు చంద్రశేఖర్..  అంటే శివుడి పేరు. అలాగే జోసఫ్ విజయ్ అని పిలిచినంత మాత్రాన నా కొడుకు క్రైస్తవుడు కాదు, అలాగని ముస్లిం కూడా కాదూ, హిందువు కూడా కాదు, అతనో మనిషి, భారతీయుడు.. అంతే’  అని ఆయన అన్నారు.  సినిమాను సినిమాలాగే చూడాలి కానీ అనవసర వ్యాఖ్యలు చేసి వివాదాస్పదం చేయకూడదుఅని అన్నారు. అయితే బీజేపీ, హిందూ సంస్థల రాద్ధాంతం నేపథ్యంలో ‘మెర్సల్’ సినిమాలో ఉన్న అభ్యంతరకర సన్నివేశాలను  తొలగించడానికి  నిర్మాతలు కూడా ఒప్పుకున్నారు.