‘అర్జున్‌రెడ్డి’ దూకుడు - MicTv.in - Telugu News
mictv telugu

‘అర్జున్‌రెడ్డి’ దూకుడు

October 30, 2017

‘అర్జున్‌రెడ్డి’ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో నటించిన విజయ్ దేవరకొండ వరుస అవకాశాలతో దూకుడు మీదున్నాడు. దాదాపు పది సినిమాలకు ఓకే చెప్పాడు. ‘మహానటి’ సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు విజయ్.

‘చాలా విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నానని’ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పాడు. ‘అర్జున్‌రెడ్డి’ సినిమా చేస్తునన్ని రోజులూ విజయ్ రొమాంటిక్‌ కామెడీ, సున్నిమైన భావోద్వేగాలను కలిగించే సినిమాలకు దూరంగా ఉన్నాడట, కేవలం డార్క్‌ డ్రామా సినిమాలనే చూస్తూ, వాటినే ఆయన మెదడులో ఎక్కించుకున్నాడు. అందుకేనేమో  కేవలం రూ.4కోట్లతో తెరకెక్కిన ‘అర్జున్‌రెడ్డి’ సినిమా రూ.50కోట్లకు పైగా వసూళ్లను సాధించి, 2017లో విడుదలైన టాప్‌ చిత్రాల సరసన నిలిచింది.