విజయ్ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది - MicTv.in - Telugu News
mictv telugu

విజయ్ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది

February 23, 2018

‘అర్జున్ రెడ్డి’ మూవీ తర్వాత విజయ దేవరకొండ మార్కెట్ ఒక్కసారిగా తారస్థాయికి చేరుకుంది. అరడజను సినిమాల వరకు చేస్తూ చాలా బిజీగా వున్నాడు. కథా బలమున్న సినిమాలనే ఎంచుకున్నాడట. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌లో అత్యంత భారీ ప్రతిష్టాత్మక చిత్రంలో నటిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ సంస్థ కూడా ఈ సినిమాలో భాగస్వామ్యం పంచుకుంటోంది. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. మే 18వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇంకొన్ని రోజుల్లో ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే విజయ్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినమా పేరును ట్యాక్సీవాలాగా ఖరారు చేశారని వార్తలు వస్తున్నా, అధికారికంగా ప్రకటించలేదు.