నేను నిర్దోషినే...నిరూపించుకునే సాక్ష్యాలు ఉన్నాయి - MicTv.in - Telugu News
mictv telugu

నేను నిర్దోషినే…నిరూపించుకునే సాక్ష్యాలు ఉన్నాయి

December 16, 2017

కమేడియన్ విజయ్ సాయి  ఆత్మహత్య ఉదంతం రోజుకో మలుపు తిరుగుతుంది. ‘అన్యాయంగా నాకొడుకును చంపుతామంటూ బెదిరించి వాడు ఆత్మహత్య చేసుకునేలా చేశారు’.. అని విజయ్ తల్లిదండ్రులు కోడలు వనితపై ఆరోపణలు చేస్తుంటే, అజ్ఘాతంలో ఉన్న వనిత తాజాగా ఓ సెల్ఫీవీడియోను మీడియాకు పంపింది.
‘విజయ్ చావుకు నేనే కారణం అని అంటున్నారు. అది ముమ్మాటికీ అబద్దం.  నేను గత మూడు సంవత్సరాలుగా విజయ్‌కి దూరంగా బ్రతుకుతున్నాను. ఇప్పుడు అతని ఆత్మహత్యకు నాకు సంబంధం ఉందనడం అన్యాయం. నేను నిర్థోషినే  నిరూపించుకోవడానికి నాదగ్గర చాలా సాక్ష్యాలు ఉన్నాయి.  అవన్నీ తీసుకుని త్వరలోనే పోలీసులకు లొంగిపోతా. నాకూతురి గురించి ఆలోచించే అజ్ఘాతంలోకి వెళ్లానే తప్ప, తప్పు చేసి కాదు. నాపై లేని పోని నిందలు మోపుతున్నారు. నేనే సంపాదించిన డబ్బులు మొత్తం వారే లాక్కున్నారు. ఒక ఆడదానిగా నా కూతురిని నేనేలా పోషించుకోవాలి. విజయ్  తల్లిదండ్రులు వేసే నిందల వల్ల నాసినిమా, సీరియల్ అవకాశాలు పోయాయి. నేను నాబిడ్డను ఎలా పోషించుకోవాలి. వారు మీడియా ముందుకు వచ్చి ఏదేదో చెబుతున్నారు,అవి నమ్మద్దు. విజయ్ ఎలాంటి వాడో తెలిపే రెండు ఫోటోలను కూడా పంపిస్తున్నాను. తగిన సాక్ష్యాలతో త్వరలో పోలీసులకు సరెండర్ అవుతాను’ అని  వనిత సెల్ఫీ వీడియోలో చెప్పింది.