విజయ్..నితిన్ కంటే మంచి నటుడు - MicTv.in - Telugu News
mictv telugu

విజయ్..నితిన్ కంటే మంచి నటుడు

September 2, 2017

‘అర్జున్ రెడ్డి’ రాంగోపాల్ వర్మ ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. ఈ సినిమాకు, సినిమా హీరో విజయ్ దేవరకొండకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయిన ఆర్జీవీ ఫేస్బుక్ వ్యాఖ్యలతో మరో దుమారానికి తెరలేపాడు. హీరో నితిన్ వంటి పవన్ కల్యాణ్ అభిమానులకు, సినీ విమర్శకుడు కత్తి మహేశ్ కు మధ్య రేగుతున్న గొడవను కూడా ఇందులోకి లాగాడు. ముఖ్యంగా నితిన్ ను టార్గెట్ చేసుకుని వర్మ ఫేస్బుక్ లో వరుస పోస్టులు పెడుతున్నాడు.

ఓ పోస్టులో..

 

‘అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి నాకంటే గొప్పదర్శకుడని ఒప్పుకుంటున్నాను. అలాగే తెలంగాణ స్టార్ నితిన్ కూడా విజయ్ దేవరకొండ తనకుంటే మంచి నటుడని అంగీకరిస్తాడో లేదోనని వేచిచూస్తున్నా.. ’ అని రాశాడు.

మరో పోస్టులో..

 

‘రియల్ స్టార్ విజయ్ దేవరకొండ అని నితిన్ అంగీకరించపోతే అతడు కూడా అలా అంగీకరించని ఫేక్ పవర్ స్టార్(పవన్ కల్యాణ్)లా మిగిలిపోతాడు.. రియల్ సూపర్ డ్యూక్ స్టార్ మహేశ్ బాబు విజయ్ దేవరకొండ విజయాన్ని మెచ్చుకున్నాడు గాని ఫేక్ పవర్ స్టార్ మెచ్చుకోలేదు..’ అని రాశాడు. విజయ్ ని మెచ్చుకున్న మహేశ్ పై గౌరవం పదింతలు పెరిగిందని మరో పోస్టులో కొనియాడారు.

కత్తి మహేశ్ ను నితిన్ బెదిరించిన నేపథ్యంలో వర్మ అతన్ని టార్గెట్ చేసుకున్నాడు.