సైరాలో విజయశాంతి! - MicTv.in - Telugu News
mictv telugu

సైరాలో విజయశాంతి!

October 25, 2017

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ చారిత్రక సినిమాలో ఓ కీలక పాత్రలో విజయశాంతి నటిస్తుందన్న వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకుడు, రామ్ చరణ్ నిర్మాత.

సినిమాల్లో నటించడానికి సుముఖంగా వున్నానని ఆ మధ్య విజయశాంతి ప్రకటించిన విషయం తెలిసిందే. చిరంజీవి చొరవ వల్లే విజయశాంతి సైరాలో నటించడానికి సుముఖత చూపినట్టు సమాచారం. చారిత్రక నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమాలో విజయశాంతి ముఖ్య పాత్రలో నటిస్తుండటం ప్రాముఖ్యతను సంతరించుకున్నది. ఇప్పుడు రాజకీయంగా క్రియాశీలంగా లేని ఈ లేడీ అమితాబ్.. మళ్లీ వెండితెరపై మరెన్ని సంచలనాలు స‌ృష్టిస్తుందో చూడాలి.