కాంగ్రెస్ సీనియర్ నాయకుల మధ్య చిచ్చుపెట్టిన రాములమ్మ - MicTv.in - Telugu News
mictv telugu

కాంగ్రెస్ సీనియర్ నాయకుల మధ్య చిచ్చుపెట్టిన రాములమ్మ

November 24, 2017

ఎన్నికల సీజన్, కొత్త సమీకరణలు, సరికొత్త రాజకీయ ఎత్తుగడలు… ఇప్పుడు అన్ని పార్టీల లక్ష్యం 2019 అసెంబ్లీ ఎన్నికలు, రెండు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. ఇందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ టీఆర్ఎస్‌ను ఢీకొట్టడానికి అన్ని ఆయుధాలను సిద్ధం చేసుకుంటోంది. ఉత్తమ్‌కుమార్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ సరికొత్త వ్యూహ రచనలు చేస్తోంది. అయితే ఈ వ్యూహాలన్నీ ఉత్తయే అని ఆ పార్టీలోని సీనియర్లు గుస గుసలాడుకుంటున్నారు. ఉత్తమ్ వన్నీ తప్పటడుగులే అని ఆపార్టీకి సంబంధించిన సీనియర్లు నిర్థారణకు వచ్చారు. అందులో మొదటి తప్పుగా విజయశాంతిని  రాహుల్ గాంధీ దగ్గరికి తీసుకుపోయి కూర్చోబెట్టడం అనేది వారి వాదన. అసలు విజయశాంతి అవుట్ డేటెడ్ సినిమా స్టార్ అని వాళ్లు  తేల్చేసి అధిష్టానం దృష్టికి తీసుకుపోయినట్టు తెలుస్తోంది. రాహుల్ గాంధీతో ఇప్పటివరకు పార్టీలో ఉన్న  సీనియర్ నాయకులు కనీసం ఫోటోలు కూడా దిగలేదని, అలాంటిది  రీఎంట్రీ పేరుతో రాములమ్మను  రాహుల్ దగ్గర ప్రవేశ పెట్టడం విడ్డూరంగా ఉందని  వాళ్లలో వాళ్లే అనుకుంటున్నారు. జానారెడ్డి లాంటి నాయకులు కూడా ఈ విషయంపై పెదవి విరిచినట్లు తెలుస్తోంది. విజయశాంతి విషయాన్ని కనీసం తమతో సంప్రదించకుండా నేరుగా అధిష్టానం వద్దకు తీసుకుపోవడం ఏంటని జానారెడ్డి అన్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి విషయంలో కూడా సీనియర్లు తమ నిరసనను ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం వద్ద నమోదు చేసినట్లు తెలుస్తోంది.