నేను పోటీ చేయను, గెలిపిస్తా.. విజయశాంతి - MicTv.in - Telugu News
mictv telugu

నేను పోటీ చేయను, గెలిపిస్తా.. విజయశాంతి

October 1, 2018

తెలంగాణ ఎన్నికల్లో తాను పోటీ చేయట్లేదని, పార్టీ గెలుపు కోసం శాయశక్తులా కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, సినీనటి విజయశాంతి తెలిపారు. సోమవారం రాములమ్మ మీడియాతో మాట్లాడుతూ.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తనను టీఆర్ఎస్ నుంచి ఎందుకు సస్పెండ్ చేశారో ఇప్పటికీ చెప్పలేదన్నారు. తన రాజకీయ ఎదుగుదల చూసే ఆయన ఆ నిర్ణయం తీసుకుని ఉంటారన్నారు.

I Will Not Contest In The Next Election but try to win Congress party says  Vijayashanthi

తెలంగాణ ఇవ్వాలని సోనియా గాంధీని వేడుకున్న కేసీఆర్.. కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ తెచ్చానని మాట్లాడటం విడ్డూరంగా ఉందని విజయశాంతి అన్నారు. టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని సోనియాకు మాటిచ్చి, ఆ మాట తప్పారని విమర్శించారు. తెలంగాణలో టీఆర్ఎస్‌పై చాలా వ్యతిరేకత ఉందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. పార్టీని గెలిపించడమే తమ లక్ష్యం అని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా తెలంగాణలోని 430 మండలాల్లో ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు.