ఏటీఎంకే స్పాట్ పెట్టింది... - MicTv.in - Telugu News
mictv telugu

ఏటీఎంకే స్పాట్ పెట్టింది…

November 20, 2017

ఆదివారం కావడంతో ఏటీఎం ఖాళీగా ఉంది.  అదే అదునుగా భావించిన ఓ మహిళ ఏటీఎంలో దొంగతనానికి ప్రయత్నించింది. కానీ  స్థానికుల చొరవతో  అడ్డంగా దొరికింది. రామవరప్పాడుకు చెందిన మహిళ  విజయవాడలోని బందరు రోడ్డులో గేట్‌వే హోటల్‌కు ఎదురుగా ఉన్న హెచ్‌డీఎఫ్ బ్యాంకు ఏటీఎంలో చోరికి   ప్రయత్నించింది.

ఆదివారం రాత్రి ఏటీఎంలో జనాలు ఎవరు లేరు ఆ సమయంలో మహిళ ఏటీఎంలోకి ప్రవేశించి, చేతికి గ్లౌజ్‌లు వేసుకుని చోరికి ప్రయత్నించింది. తన బ్యాగ్‌లో తెచ్చుకున్నకటింగ్ ప్లేయర్‌తో ఏటీఎంలోని విద్యుత్త్ వైర్లను కత్తిరించింది. అదే సమయానికి నగదు విత్ డ్రా చేసుకోవడానికి ఏటీఎంకు వచ్చిన వ్యక్తులు ఆ మహిళను పట్టుకున్నారు. ఆమె దగ్గర ఉన్న బ్యాగ్‌ను తనిఖీ చేయగా యాసిడ్ బాటిల్, కటింగ్ ప్లేయర్, కట్టర్, స్క్రూడ్రైవర్ వంటి పరికరాలు కనిపించాయి. దాంతో ఆమెను పోలీసులకు అప్పగించారు.