జలీల్ ఖాన్‌ను సైకిల్‌పై ఊరేగించిన గన్‌మెన్.. ఔరా అన్న విజయవాడ - MicTv.in - Telugu News
mictv telugu

జలీల్ ఖాన్‌ను సైకిల్‌పై ఊరేగించిన గన్‌మెన్.. ఔరా అన్న విజయవాడ

April 24, 2018

బీకామ్‌లో ఫిజిక్స్, మాథ్స్ చదివిన ఏపీ టీడీపీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్  మళ్లీ సోషల్ మీడియాకు అడ్డంగా దొరికాడు. ఈసారి సైకిల్ ఎక్కినందుకు అతనితో నెటిజన్లు చెడుగుడు ఆడుకుంటున్నారు. సైకిల్ ఎక్కితే ఆడుకోవడం ఏమిటి? అనుకుంటున్నారా? అవును సైకిల్ ఎక్కినందుకే నెటిజన్లు జలీల్‌ఖాన్‌తో ఒక ఆట ఆడుకుంటున్నారు.

విషయంలోకి వెళ్తే.. ఏపీకి ప్రత్యేక  హోదా కోసం ఒక రోజు దీక్ష చేసి అవిశ్రాంతంగా పోరాడుతున్న  ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఈ డిమాండును సాధించడానికి అందరూ సైకిల్ ఎక్కాలని పిలుపు ఇచ్చారు. ఆ పిలుపును అందుకున్న జలీల్‌ఖాన్ మంగళవారం సైకిల్ ర్యాలీ తీసాడు. ఆయన కూడా స్వయంగా ఓ సైకిల్ ఎక్కాడు. కానీ  బరువునంతా పాపం గన్‌మెన్‌పై వేసాడు! ఆ సైకిల్‌ను నెమ్మదిగా నెట్టించుకుంటూ పోరాడుతూ వార్తలోకి ఎక్కాడు. ఈ తతంగం అంతా విజయవాడలో జరిగింది. ఈ వీడియో చూసిన జనం పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. జలీల్ సైకిల్ ఎక్కినట్లు లేదని, ఆయనను, సైకిల్‌ను కలిసి తోస్తున్నట్లు ఉందని అంటున్నారు. జలీల్‌ను సైకిల్‌పై ఊరేగించినట్లు ఉందని మరికొందరు జోకులేస్తున్నారు.  ఈ ‘తోడుపుబండి’ కార్యక్రమంలో ఎంపీ కేసినేని నాని కూడా పాల్గొన్నాడు.