జనసేన ఆఫీసులో కామ్రేడ్లకు ఘోర పరాభవం - MicTv.in - Telugu News
mictv telugu

జనసేన ఆఫీసులో కామ్రేడ్లకు ఘోర పరాభవం

April 12, 2018

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో కామ్రేడ్లు రాసుకుపూసుకు తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల విజయవాడలో జరిగిన పాదయాత్రలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మదు, పవన్ పక్కపక్కనే ఆయాసపడుతూ మరీ నడిచారు. మధు ఉక్కపోతతో చొక్కా విప్పేయగా, పవన్ దాన్ని తన చేతిపై వేసుకుని మరీ సంఘీభావాన్ని చాటిచెప్పారు. అలాంటి మధుకు విజయవాడలో జనసేన కార్యాలయం ముందు ఘోర పరావభవం ఎదురైంది.

పవన్ కల్యాణ్ గురువారం లెఫ్ట్ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో పాటు మరో ఇద్దరు నేతలు జనసేన కార్యాలయానికి వచ్చారు.  వారు కార్యాలయం లోపలకు వెళ్తుండగా, భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నారు. సమావేశానికి సంబంధించి తమకు ఎలాంటి సమాచారమూ లేదని, లోపలికి వెళ్లడానికి అనుమతించబోమని తేల్చిచెప్పారు. దీంతో సదురు కామ్రేడ్లు గేటు బయటే నిలబడ్డారు.

పవన్ ఆ సమయంలో ఖమ్మం జిల్లాకు చెందిన నేతలతో సమావేశంలో ఉన్నాడు. మధు తన కార్యాలయానికి వచ్చిన విషయం తెలుసుకున్న పవన్ వారిని లోపలకి అనుమతించాలని తన సిబ్బందికి సూచించిన తర్వాత సెక్యూరిటీ సిబ్బంది వారిని లోపలికి అనుమతించారు.