విక్రమ్  కూతురి ప్రేమ పెళ్లి   - MicTv.in - Telugu News
mictv telugu

విక్రమ్  కూతురి ప్రేమ పెళ్లి  

October 28, 2017

ప్రముఖ తమిళ కథాయకుడు  చియాన్ విక్రమ్ కూతరు  అక్షిత వివాహం నవంబర్ 1న  జరగనుంది. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు, పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారని సమాచారం.

సికే బేకరీ యాజమాని  రంగనాథన్ కుటుంబానికి చెందిన మను రంజిత్ , అక్షిత ఇరువురు ప్రేమించుకున్నారు. వారి ప్రేమకు ఇరు కుటుంబాలు అనుమతి తెలిపి, వివాహం జరుపుతున్నారు. మను రంజిత్ ఎవరో కాదు.  తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి , డీఎంకే అధినేత కరుణానిధి కుమారుడు ముత్తు మనవడు. ఇప్పటికే  ఇరు కుటుంబాలు పెళ్లి పనుల్లో బీజీగా  ఉన్నారు. విక్రమ్ కూడా షూటింగుల నుంచి విరామం తీసుకొని కుతూరు పెళ్లి పనులను దగ్గరుండి మరి చూసుకుంటున్నాడు