కరుణ మనవడితో విక్రమ్ కూతురి పెళ్లి   - MicTv.in - Telugu News
mictv telugu

కరుణ మనవడితో విక్రమ్ కూతురి పెళ్లి  

October 30, 2017

ప్రముఖ తమిళ  కథానాయకుడు విక్రమ్ కుమార్తె వివాహం  తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ముని వనవడు మనూ రంజిత్‌తో సోమవారం ఉదయం చెన్నైలో అంగరంగ వైభవంగా జరిగింది.

అక్షిత, రంజిత్ చాన్నాళ్లుగా  ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను  ఇరువురి కుటుంబాలు అంగీకారం తెలిపి  పెళ్లికి  ఓకే చెప్పారు. దాంతో 2016 జూలైలో వీరి నిశ్చితార్థం జరిగింది. ఈ రోజు ఉదయం పెళ్లితో జంట ఒకటయారు.  ప్రస్తుతం విక్రమ్ ‘సామి స్క్వేర్’ చిత్రంలో నటిస్తున్నాడు.  కూతురి పెళ్లి కోసం  కొద్ది రోజులు విరామం తీసుకున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రంలో విక్రమ్‌కు జోడిగా కీర్తి సురేశ్ నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలను అందిస్తున్నాడు. విక్రమ్ కొడుకు ధ్రువ్  ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ చిత్రంలో నటిస్తుండడం తెలిసిందే.