పల్లె కోకిల పసల బేబీకి ముఖ్యమంత్రి సత్కారం

ప్రతిభ ఉంటే ఎప్పటికైనా లోకం గుర్తించి తీరుతుంది. ఎలాంటి శిక్షణ లేకున్నా, ఎవరూ నేర్పకున్నా ఎంతో కమనీయంగా పాటలు పాడుతున్న పల్లె కోకిక పలస బేబీనే ఇందుకు నిదర్శనం. మొత్తం తెలుగు ప్రజలందరికీ తెలిసిపోయిన బేబీని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఘనంగా సత్కరించారు.

రాజమండ్రి ఎంపీ మురళీమోహన్, ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి  ఉండవల్లి చంద్రబాబుకు బేబీని పరిచయం చేశారు. ఎంతో అనుభవమున్న గాయకుల్లా ఆమె పాడగలదని వివరించారు. వ్యవసాయ కూలీగా ప్రారంభమైన బేబీ లక్షల మంది  శ్రోతలను మెప్పించడం గర్వకారణమని ముఖ్యమంత్రి కొనియాడారు. ఈ సందర్భంగా బేబీ పాట పాడగా సీఎం భినందించారు. ఆమెను మరింత ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వడిశలేరుకు చెందిన బేబీ  గ్రామీణ నేపథ్య గాయకురాలు పసల బేబీ ప్రతిభ మట్టిలో మాణిక్యం దొరికిన్లు ఇన్నేళ్లకు బయటి ప్రపంచానికి తెలిసిన విషయం విదితేమే. ఆమెను సంగీత దర్శకులు కీరవాణి, ఏఆర్‌ రెహమాన్‌ కూడా కొనియాడారు. మెగాస్టార్ చిరంజీవి కూడా బేబీని సత్కరించి, నగదు సాయం కూడా చేశారు.