కన్నీటి సంద్రమైన గ్రామాలు.. అయ్యప్ప భక్తుల భౌతిక కాయాలకు నివాళులు.. - MicTv.in - Telugu News
mictv telugu

కన్నీటి సంద్రమైన గ్రామాలు.. అయ్యప్ప భక్తుల భౌతిక కాయాలకు నివాళులు..

January 9, 2019

ఊళ్లు కన్నీటి చెరువులయ్యాయి. గడప గడపలో విషాదం అలుముకుంది. చుట్టు పక్కల గ్రామాలవాళ్ళంతా వచ్చి మృతులకు కడసారి వీడ్కోలు పలుకుతూ కన్నీరు మున్నీరయ్యారు. ఈ హృదయవిదారక దృశ్యాలు మెదక్‌ జిల్లా హత్నూర, నర్సాపూర్‌, వర్గల్‌ మండలాల పరిధిలోని వివిధ గ్రామాల్లో  చోటు చేసుకున్నాయి. మూడు రోజుల క్రితం తమిళనాడులోని పుదుకొట్టయ్ జిల్లా తిరుమయం దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పదిమంది అయ్యప్ప స్వామి భక్తులు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. మృతులంతా ఆ మూడు మండలాల పరిధిలోని మంతూరు, ఖాజీపేట, రెడ్డిపల్లి, నెంటూరు, చిన్నచింతకుంట, మంగాపూర్‌ గ్రామాలకు చెందినవారు.

Telugu news Villages that are tears of ocean .. Tribute to the dead bodies of Ayyappa devotees ..

కాగా, వారి మృతదేహాలు మంగళవారం ఉదయానికి స్వగ్రామాలకు చేరుకుంటాయన్నారు. కానీ అది సాధ్యం కాలేదని అధికారులు సమాచారం అందించారు. దీంతో వారివారి కుటుంబ సభ్యులు తమవారి కడచూపుకోసం కన్నీళ్లు కారుస్తూ ఎదురుచూస్తున్నారు. చివరికి సాయంత్రం  5.30 గంటలకు పది అంబులెన్సులు నర్సాపూర్‌కు చేరుకున్నాయి. తర్వాత అంబులెన్స్‌లను ర్యాలీగా మృతుల స్వస్థలాలకు తరలించారు. ఇసుక వేస్తే రాలనంత జనం అంతిమ యాత్రలో పాల్గొన్నారు. వ్యాపారులు దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు.

వారిని ఓదార్చడం ఎవరితరం కావడంలేదు…

మృతుల భౌతిక దేహాలు ఆయా గ్రామాలకు చేరుకోగానే బంధువులు, గ్రామస్థుల రోదనలు మిన్నంటాయి. ఆయా గ్రామాల్లో విషాద వాతావరణం నెలకొంది. జన్ముల సురేశ్‌కు చిన్నచింతకుంట గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. శివప్రసాద్‌, శ్యామ్‌ సుందర్‌గౌడ్‌లకు మంతూరులో కడసారి వీడ్కోలు పలికారు. నక్క ఆంజనేయలు, అంబర్‌పేట కృష్ణలకు రెడ్డిపల్లిలో అంత్యక్రియలు నిర్వహించారు. నాగరాజుగౌడ్‌, జుర్రు మహేశ్‌, బోయిని కుమార్‌లకు ఖాజీపేటలో, రాజేశ్‌ గౌడ్‌కు వర్గల్‌ మండలం నెంటూరులో అంత్యక్రియలు పూర్తయ్యాయి. ప్రవీణ్‌గౌడ్‌ స్వగ్రామం మెదక్‌ మండలం మగ్దుంపూర్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. Telugu news Villages that are tears of ocean .. Tribute to the dead bodies of Ayyappa devotees ..