సల్మాన్ హీరోయిన్‌ను ఆదుకున్న మనసున్న విలన్ రవికిషన్ - MicTv.in - Telugu News
mictv telugu

సల్మాన్ హీరోయిన్‌ను ఆదుకున్న మనసున్న విలన్ రవికిషన్

March 22, 2018

క్షయ వ్యాధితో బాధపడుతున్న బాలీవుడ్ నటి పూజా దడ్వాల్ 15 రోజుల క్రితం ముంబైలోని సెవ్రీ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. భర్త, బంధువులు ఎవరూ తనను పట్టించుకోవటం లేదని బాధపడింది పూజ. తనదగ్గర చాయి తాగుదామన్నా డబ్బులు లేవని కన్నీరు మున్నీరైంది. సల్మాన్‌ఖాన్‌ను కలిసి సాయం అర్థిస్తానని చెప్పింది. కాగా ఆమెను ఆదుకోవటానికి రేసుగుర్రం ప్రతినాయకుడు రవికిషన్ ముందుకు వచ్చాడు. తన స్నేహితుడైన ఉదయ్‌ భగత్ అనే వ్యక్తి ద్వారా పూజాకి సాయం చేశారు. చికిత్సకు కావాల్సిన డబ్బుతో పాటు పండ్లు కూడా పంపిణీ చేశారు. ప్రియ పరిస్థితిని వివరిస్తూ ఉదయ్‌‌భగత్ ఓ వీడియోను‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.సినిమాల్లో విలన్ పాత్ర వేసినప్పటికీ తనకు హీరోలాంటి పెద్ద మనసుందని నిరూపించిన రవికిషన్‌కు సోషల్ మీడియాలో ప్రశంసలు అందుతున్నాయి. 1997లో వచ్చిన ‘తుమ్సే ప్యార్ హో గయా’ చిత్రంలో రవికిషన్‌తో కలిసి పూజా నటించారు. 1990లో విడుద‌లైన‌ వీర్‌గతితోపాటు హిందుస్థాన్, సిందూర్ సౌగంధ్‌లాంటి సినిమాల్లో నటించింది పూజా ద‌డ్వాల్‌. సల్మాన్ ఖాన్ సరసన ‘ వీర్‌గతి ’ సినిమాలో నటించిన పూజకు ఆ సినిమా ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చింది. సల్మాన్ ఖాన్ కూడా స్పందించి ఆమెను ఆదుకోవాలని సోషల్ మీడియాలో కోరుతున్నారు.

సినిమాల్లో విలన్ పాత్ర వేసినప్పటికీ తనకు హీరోలాంటి పెద్ద మనసుందని నిరూపించిన రవికిషన్‌కు సోషల్ మీడియాలో ప్రశంసలు అందుతున్నాయి. 1997లో వచ్చిన ‘తుమ్సే ప్యార్ హో గయా’ చిత్రంలో రవికిషన్‌తో కలిసి పూజా నటించారు. 1990లో విడుద‌లైన‌ వీర్‌గతితోపాటు హిందుస్థాన్, సిందూర్ సౌగంధ్‌లాంటి సినిమాల్లో నటించింది పూజా ద‌డ్వాల్‌. సల్మాన్ ఖాన్ సరసన ‘ వీర్‌గతి ’ సినిమాలో నటించిన పూజకు ఆ సినిమా ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చింది. సల్మాన్ ఖాన్ కూడా స్పందించి ఆమెను ఆదుకోవాలని సోషల్ మీడియాలో కోరుతున్నారు.