వీళ్ల బర్త్‌డే పాడుగాను.. కేకును తుపాకీతో షూట్ చేసి… వీడియో

పుట్టినరోజు వేడుక నిర్వహిస్తే జీవితాంతం గుర్తుండాలని కొందరు అతి చేస్తున్నారు. మన పుట్టుకకు అర్థం ఏంటో, ఏం చెయ్యటానికి వచ్చామో, ఆరోజు ఏ మంచి పని చేస్తే బాగుంటుందోనని ఆలోచించకుండా బర్త్ డే సెలెబ్రేషన్స్ చాలా అట్టహాసంగా నిర్వహిస్తున్నారు కొందరు. కేక్ కట్ చేసి తిని నోరు తీపి చేసుకోకుండా దాన్ని ముఖాలమీద పూసుకోవడానికే ఎక్కువగా వాడేస్తున్నారు. అలాంటిదే ఈ ఘటన. కొంతమంది యువకులు రోడ్డుపై బర్త్ డే వేడుక చేసుకున్నారు. కేకు కత్తితో కట్ చేయాల్సింది పోయి తుపాకీతో షూట్ చేశారు.

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ బీచ్ వద్ద స్నేహితుని పుట్టినరోజును వింతగా, వినూత్నంగా ట్రై చేశారు ఆ నలుగురు స్నేహితులు. వారిలో ఇద్దరు చేతిలో తుపాకులు పట్టుకుని కేక్‌కు గురిపెట్టి కాల్చారు. గురి తప్పిందని ఓ ఫ్రెండు మళ్లీ కాల్చమని ప్రోత్సహించగా మళ్లీ కాల్పులు జరిపాడు. అంతే కేకు పైకి చిమ్మింది. ఫైరింగ్ కూడా చేశారు. అంతే అందరూ ఏదో ఘనకార్యం సాధించినవారిలా ఈలలు, కేకలు పెట్టారు. ఇదంతా ఒకరు వీడియో తీసి బడాయికన్నట్టు సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఆ వీడియో కాస్త వైరల్‌గా మారింది. కాగా ఈ ఉదంతంపై మీరట్ పోలీసులు మాట్లాడుతూ ఈ వీడియో ఈ ప్రాంతానికి చెందింది కాదని స్పష్టం చేశారు. త్వరలోనే వాళ్ళను పట్టుకుంటామని చెప్పారు.Telugu news Viral Video Youth cuts birthday cake with gun in Uttar Pradesh’s Meerut; video will make you go ROFL