నవ దంపతులుగా విరాట్ - అనుష్కల ఆనందం - MicTv.in - Telugu News
mictv telugu

నవ దంపతులుగా విరాట్ – అనుష్కల ఆనందం

December 11, 2017

ఎందరో అటు విరాట్ అభిమానులు, ఇటు అనుష్క అభిమానులు ఎదురు చూస్తున్న ఘడియా రానే వచ్చింది. ఇద్దరు పెళ్లితో ఒక్కటయ్యారు. ఇంత వరకూ వారి విషయంలో ఓ సందిగ్ధత నెలకొని వున్నది. కాగా వారి పెళ్ళి అయినట్టుగా విరాట్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. అందుకు సంబంధించిన ఫోటో కూడా షేర్ చేసి తన ఆనందాన్ని షేర్ చేసుకున్నాడు. ఫోటోలో అనుష్క తన మెడలో కళ్యాణ మాల వేస్తున్నట్టున్న ఫోటోను షేర్ చేశాడు విరాట్.

‘ ఈరోజు తామిద్దరం జీవితాంతాంతం ప్రేమగా ఉంటామని ఒకరికొకరు ప్రమాణం చేసుకున్నామని, నిండు మనస్సుతో తమను ఆశీర్వదించాలని ’  శ్రేయోభిలాషులను, అభిమానులను కోహ్లీ కోరాడు. ఈరోజు తనకెంతో ప్రత్యేకమైందని చెప్పుకొచ్చాడు.  కుటుంబ సభ్యులు, అభిమానులు, శ్రేయోభిలాషుల ప్రేమతో నిండిన రోజుగా కోహ్లీ చెప్పాడు. తన ప్రయాణంలో ముఖ్య భూమిక పోషించిన వారందరికీ కోహ్లీ ధన్యవాదాలు తెలిపాడు. ఇటలీలోని మిలాన్‌లో పెళ్లి చేసుకున్న విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ జంటకు పలువురు క్రికెటర్లు, బాలీవుడ్ ప్రముఖులు పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పారు. 2013లో ఓ వాణిజ్య ప్రకటనలో ఇద్దరి మధ్యా ప్రేమ చిగురించిన విషయం విదితమే.