హైదరాబాద్’లో అమిర్ 

ఈ రోజు  ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో  జరగనుంది. ఈ మ్యాచ్‌ను చూడటానికి  ఎవరూ ఊహించని అతిథి వస్తున్నారు. ఆయన ఎవరో కాదు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమిర్ ఖాన్.   భారత క్రికెట్ కెప్టెన్  విరాట్ కోహ్లి ఈ మ్యాచ్ చూడటానికి రావల్సిందిగా అమిర్‌ను ఆహ్వనించాడు.  ఇటీవల ఓ టీవీ చానల్ కోసం దీపావళి స్పెషల్ ఎపిసోడ్‌లో వీరిద్దరు కలసి పార్టీసిపేట్  చేశారు.

అప్పుడే ఈ మ్యాచ్ చూడటానికి రావాలని విరాట్ పదే పదే అమిర్‌కు చెప్పాడు. ఆ షో పూర్తయిన తర్వాత టీమిండియా జెర్సీని కూడా విరాట్ అమిర్‌కి ఇచ్చాడు. అమిర్ తన సినిమా‘ సీక్రెట్  సూపర్ స్టార్’ ట్రైలర్‌ను విరాట్‌కు చూపించాడు. ఈ మ్యాచ్  సందర్బంగా మళ్లీ కలుద్దామంటూ విరాట్ అమిర్‌తో చెప్పాడు. ‘దంగల్ ’ఫేమ్ జైరా వసీమ్ అమిర్‌తో కలిసి మ్యాచ్ చూడటానికి వచ్చే అవకాశం ఉందని సమాచారం. క్రికెట్ టీమ్ ఉంటున్న హోటల్లోనే అమిర్‌కు కూడా ఏర్పాట్లు చేసినట్టు తెలిసింది. అమిర్  విరాట్ ఇచ్చిన జెర్సీ వేసుకుని ఈ మ్యాచ్ చూడనున్నాడు.

SHARE