బృందావనము, నందనవనము రోమ్ నగరమే.. - MicTv.in - Telugu News
mictv telugu

బృందావనము, నందనవనము రోమ్ నగరమే..

December 13, 2017

‘ప్రేమయాత్రలకు బృందావనము, నందనవనము ఏలనో.. ’ గుండమ్మ కథ సినిమాలోని ఈ పాట గుర్తుందిగా.. విరుష్కకు ఈ తెలుగు పాట తెలియకున్నా.. ఇలాగే అనుకున్నట్టు ఉంది. ఈ కొత్త జంట హనీమూన్‌ను రోమ్ మహానగరంలో జరుపుకుంటోంది.భారత క్రికెటర్ జట్టు నాయకుడు విరాట్ కోహ్లి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఇటలీలోని కొద్దిమంది సమక్షంలో జరగడం తెలిసిందే. పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వీరు హనీమూన్‌కు మళ్లీ ఎక్కడికో ఎంత దూరమో వెళ్లడం ఎందుకని ఇటలీలోనే ఉన్న రోమ్‌ను సెలక్ట్ చేసుకున్నారు.  ఇప్పటికే అక్కడికి చెక్కేశారు. టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు భర్త విరాట్‌తో కలిసి  అనుష్క వెళ్లనుంది. జనవరి మెుదటి వారం నుంచి అనుష్క తిరిగి సినిమా చిత్రీకరణలో బిజీ కానుంది.