జయహో కోహ్లీ.. మూడో వన్డేలోనూ శతక్కొట్టుడు

పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. వరుసగా మూడో వన్డేలోనూ సెంచరీ చేశాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డేలో కెప్టెన్ బాదిపడేశాడు. తన కెరీర్లో 38వ సెంచరీ సాధించాడు. ఈ రికార్డు సాధించిన తొలి భారతీయ అటగాడిగా చరిత్రకెక్కాడు.

rtrtrt

తొలి వన్డేలో 140 పరుగులు చేసిన కోహ్లీ.. రెండో వన్డేలో 157 చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్  50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 283 పరుగులు చేసింది. ఈ టార్గెట్ ఛేదనకు బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ మొదట్లో తడబడింది. ఓపెనర్ రోహిత్ శర్మ (8)కే పెవిలియన్ బాట పట్టాడు. తర్వాత శిఖర్ ధవన్‌తో కలిసి కోహ్లీ దడ పుట్టించాడు. మొత్తం 110 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కోహ్లి ఒక్కడే బాధ్యతనంతా తన భుజాలపై వేసుకోని గెలుపు కోసం పోరాడినా ఫలితం లేకపోయింది. 47.4 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 240 పరుగుల వద్ద ఆగిపోయింది. భారత్ పై 43 పరుగుల తేడాతో వెస్టిండీస్ గెలిచేసింది. కోహ్లీ 107 పరుగులు చేశాడు.