కెప్టెన్‌గా కోహ్లీ ఐదు డబుల్ సెంచరీలు - MicTv.in - Telugu News
mictv telugu

కెప్టెన్‌గా కోహ్లీ ఐదు డబుల్ సెంచరీలు

November 26, 2017

కెప్టెన్‌గా కోహ్లీ.. బ్రియాన్ లారా రికార్డును సమం చేశాడు. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మూడో ఆటలో విరాట్ కోహ్లీ ఈ రికార్డుకు తెరలేపాడు. అద్భుత ఫామ్‌లో ఉన్న  కోహ్లి.. రాకెట్‌ వేగంతో చెలరేగిపోయాడు. ఆదివారం విదర్భ క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో ఉన్న అభిమానులకు మంచి ఉత్సాహాన్ని ఇచ్చాడు.

259 బంతుల్లో  15 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టి  డబుల్‌ సెంచరీ నమోదు చేశాడు. టెస్టు కెరీర్‌లో విరాట్‌కు ఇది ఐదో డబుల్ సెంచరీ కావడం విశేషం. భారత్ తరపున టెస్టుల్లో ఎక్కువసార్లు డబుల్ సెంచరీ చేసిన వాళ్లు…సచిన్‌ తెందుల్కర్‌-6 సార్లు, వీరేంద్ర సెహ్వాగ్‌-6 సార్లు, రాహుల్‌ ద్రవిడ్‌-5 సార్లు 
విరాట్‌ కోహ్లి-5 సార్లు..కానీ కెప్టెన్ గా మాత్రం భారత్‌లో అత్యదిక డబుల్ సెంచరీలు విరాట్ ఖాతాలో జమయ్యాయి.