పంజాబ్ నేషనల్ బ్యాంకుకు కోహ్లీ గుడ్‌బై... - MicTv.in - Telugu News
mictv telugu

పంజాబ్ నేషనల్ బ్యాంకుకు కోహ్లీ గుడ్‌బై…

February 21, 2018

పంజాబ్ నేషనల్ బ్యాంకులో జరిగిన రూ.11,400 కోట్ల కుంభకోణం ఆ బ్యాంకును కష్టాల్లోకి నెట్టింది. సీబీఐ అధికారులు ఈ బ్యాంకు బ్రాడీహౌస్ బ్రాంచి జీఎంను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ బ్యాంకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నటీమిండియా క్రికెట్ సారథి విరాట్ కోహ్లీ సైతం పీఎన్‌బీతో తెగతెంపులు చేసుకోనున్నట్టు సమాచారం.  ప్రజలను మోసం చేసిన బ్యాంకుకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండడం తనకు ఇష్టం లేదని విరాట్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తన సన్నిహితులు చెబుతున్నారు. పీఎన్‌బీ హోదాకు మరింత వన్నె తీసుకొచ్చే విధంగా కోహ్లీ 2016లో బ్రాండ్ అంబాసిడర్ బాధ్యతలు స్వీకరించారు. మొండిబకాయిలతో కొట్టుమిట్టాడుతున్న ఈ బ్యాంకులో, కొత్త వినియోగదారులు ఖాతాలు తెరవాలంటూ  కూడా ప్రమోట్ చేశాడు. ఇదే బ్యాంకులో కోహ్లీకి తన16వ ఏట నుంచే బ్యాంకు ఖాతా ఉండడం విశేషం.ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ పీఎన్‌బీకి రూ. 11,400 కోట్లు ఎగ్గొటి విదేశాలకు పారిపోవడం తెలిసిందే.