కోహ్లీ, శిఖర్ ధావన్ భార్యల మధ్య చిచ్చురేగింది! - MicTv.in - Telugu News
mictv telugu

కోహ్లీ, శిఖర్ ధావన్ భార్యల మధ్య చిచ్చురేగింది!

October 5, 2018

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్కా శర్మ, ఓపెనర్ శిఖర్ ధావన్ భార్య అయేషా ఛటర్జీకి మధ్య చిచ్చురేగింది. ఎందుకో తెలుసా? వెస్టిండీస్ సిరీస్‌లో ధావన్‌కు చోటు దక్కలేదు. కోహ్లీ భార్య అనుష్కా శర్మ, ధావన్ భార్య అయేషా ఛటర్జీకి మధ్య మంచి స్నేహం ఉంది. ఎక్కడికెళ్లినా ఇద్దరు కలిసే వెళ్తుంటారు. నిన్నమొన్నటి వరకూ మంచి స్నేహితులుగా ఉన్న అనుష్కఆయేషాలు ఇప్పుడు కనీసం మాట్లాడుకోవడం లేదనీ, ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారని వార్తలు వస్తున్నాయి.

Virat Kohli And Shikhar Dhawan's Wifes Are  Aghast

దీనికి కారణం వెస్టిండీస్ సిరీస్‌లో ధావన్‌‌కు విశ్రాంతి కల్పించి,  పృథ్వీషా‌కు అవకాశం కల్పించారు. అయితే ధావన్‌కు  చోటు దక్కకపోవడానికి కోహ్లీయే కారణమని భావించిన అయేషా.. అనుష్కా శర్మతో మాట్లాడటం మానేసిందట. అయితే దీనిపై ఆయేషా స్పందిస్తూ.. అలాంటి గొడవేమీ లేదనీ, తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని స్పష్టం చేసింది. అనుష్కా శర్మ మాత్రం ఇంకా స్పందించలేదు.