విశాఖకు విదేశీయులు ఇక బారులు కడతారు..! - MicTv.in - Telugu News
mictv telugu

విశాఖకు విదేశీయులు ఇక బారులు కడతారు..!

December 16, 2017

విశాఖపటణం విమానాశ్రయానికి మరో  అరుదైన గుర్తింపు  లభించింది. పర్యాటక పాంత్రాలకు, వాణిజ్య  కార్యకలాపాలకు స్వర్గధామం అయిన విశాఖకు అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్యను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపటణం విమానాశ్రయానికి వీసా ఆన్ అరైవల్ సదుపాయాన్ని కల్పిస్తూ కేంద్ర  హోం శాఖ  ఉత్తర్వులు జారీ చేసింది.ఇక నుంచి వైజాగ్ వచ్చే విదేశీయులు  విమానం దిగాక ఎయిర్‌పోర్ట్ లోనే వీసా తీసుకునే సదుపాయం ఏర్పడింది. ఈ-టూరిస్ట్ వీసా ఆన్ అరైవల్‌ను శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు  ప్రారంభించారు.  వీసా ఆన్‌అరైవల్ సదుపాయాన్ని కావాలనుకునేవారు  విశాఖకు బయలుదేరే ముందు ఆన్‌లైన్‌లో వీసా ఆన్‌ అరైవల్ కోసం దరఖాస్తూ చేసుకోవాలి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 147 దేశాలకు చెందిన పర్యాటకులు వైజాగ్‌లో  ఇక నుంచి వీసా తీసుకోవచ్చు. ఇప్పటివరకు దేశంలోని 16 విమానాశ్రయాల్లో మాత్రమే వీసా ఆన్‌ అరైవల్ సదుపాయం అందుబాటులో ఉంది.