వదంతులు నమ్మకండి..నేను బాగానే ఉన్నా! - MicTv.in - Telugu News
mictv telugu

వదంతులు నమ్మకండి..నేను బాగానే ఉన్నా!

February 27, 2018

తన ఆరోగ్య పరిస్థితుల గురించి వస్తున్న వార్తలపై సినీ నటుడు విశాల్ స్పందించాడు. తన ఆరోగ్యం బాలేదని,ఆస్పత్రిలో చేరినట్లు వస్తున్న వార్తలు నిజం కాదని ట్విటర్  ద్వారా తెలియజేశాడు.‘నేను ఫిట్‌గానే ఉన్నానని అందరికీ తెలియజేస్తున్నా. మైగ్రేన్‌ సమస్య కోసం చికిత్స తీసుకోవటానికి వచ్చా. ట్రీట్‌మెంట్  కూడా అయిపోయింది. కంగారుపడాల్సిన అవసరం లేదు. మార్చి మొదటి వారంలో ఇండియాకు వచ్చేస్తా. వదంతులు నమ్మకండి’ అని ట్వీట్‌ చేశాడు.అవన్‌ ఇవన్‌(తెలుగులో వాడు-వీడు) చిత్రీకరణ సమయంలో విశాల్‌కు తలనొప్పి ప్రారంభమైంది. దానికి  తోడు తుప్పరివాలన్‌(డిటెక్టివ్‌) సమయంలో గాయపడటంతో కీళ్లనొప్పులు మొదలయ్యాయి. ఈ క్రమంలో విశాల్‌ ఆరోగ్యం బాగలేదు, విశాల్ కి ఏమో అయ్యింది. అందుకోసమే అమెరికా వెళ్లి ఆస్పత్రిలో  చేరాడంటూ వార్తలు వచ్చాయి.  విశాల్  నటించిన ఇరుంబు తిరై(తెలుగులో అభిమన్యుడు) విడుదలకు సిద్ధంగా ఉంది. సండైకోళి–2(పందెం కోడి-2)  చిత్రీకరణ జరుగుతోంది.