మంచు విష్ణు ‘ ఓటర్ ’ ఫస్ట్‌లుక్ - MicTv.in - Telugu News
mictv telugu

మంచు విష్ణు ‘ ఓటర్ ’ ఫస్ట్‌లుక్

November 23, 2017

మంచు విష్ణు నటిస్తున్న తాజా సినిమా ‘ ఓటర్ ’ ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదలైంది. విష్ణు జన్మదినం సందర్భంగా ఫస్ట్‌లుక్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ పోస్టర్‌లో విష్ణు తను ఓటు వేసినవాడిగా ఇంకు వున్న వేలును చూపిస్తున్నాడు. అతని బ్యక్‌గ్రౌండ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ నుండి అటల్ బిహారీ వాజిపేయి, కేసీఆర్, చంద్రబాబుల ఫోటోలు సహా దివంగత వైఎస్సార్ ఫోటో కూడా  అందులో వున్నాయి. పోస్టర్‌ను బట్టి ఇది పక్కా రాజకీయ నేపథ్యంలో, ఓటర్ అనేవాడు పవర్‌ఫుల్ పాత్ర అని చూపే దిశలో సినిమా వుంటుందని అర్థమవుతున్నది. తమిళంలో కూడా ఈ చిత్రం ‘ కురుళ్ 388 ’ అనే పేరుతో విడుదల అవుతున్నది. జిఎస్. కార్తీక్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబరులో విడుదల చెయ్యాలనే ప్రయత్నాలు చేస్తున్నారట.