24 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో.. - MicTv.in - Telugu News
mictv telugu

24 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో..

November 20, 2017

చైనాకు చెందిన ప్రముఖ సంస్థ వివో నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లోకి వచ్చింది.  గురుగ్రామ్‌లో జరిగిన కార్యక్రమంలో వివో ‘వీ7’ పేరుతో స్మార్ట్‌ఫోన్ విడుదల చేశారు. 24 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా దీని ప్రత్యేకత. దీంతో పాటుగా 5.7 అంగుళాల డిస్‌ప్లే ఈ స్మార్ట్‌ఫోనుకు అదనపు ఆకర్షణ. దీని ధర రూ.18,990. సోమవారం  నుంచి ఫ్రీ బుకింగ్స్‌లు ప్రారంభమయ్యాయి. ఈ నెల 24 నుంచి అమ్మకాలు చెపట్టనున్నామని కంపెనీ  తెలిపింది.

వివో‘ వీ7’ ఫీచర్లు….

5.7 అంగుళాల డిస్‌ప్లే

1440X720 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్

గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్

1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్450 ప్రాసెసర్

ఆండ్రాయిడ్‌ నూగట్ 7.1.2

4 జీబీ ర్యామ్‌ ,32జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్

256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్

24 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరా

16 మెగాపిక్సెల్‌ బ్యాక్  కెమెరా

ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ

డ్యుయల్ సిమ్,బ్యాండ్ వైపై, బ్లూటూత్

3000ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం