వికలాంగురాలిపై గ్యాంగ్ రేప్.. ఏపీలో ఘోరం - MicTv.in - Telugu News
mictv telugu

వికలాంగురాలిపై గ్యాంగ్ రేప్.. ఏపీలో ఘోరం

April 16, 2018

ఆడవాళ్ల పై,చిన్నారులపై రోజురోజుకూ వేధింపులు,అత్యాచారాలు ఎక్కువైతున్నాయి. ఓ ఆటో డ్రైవర్ ,అతని స్నేహితులు ఓ దివ్యాంగురాలుపై అత్యాచారానికి  పాల్పడ్డారు. ఈ ఘటన ఏపీలోని విజయనగరం జిల్లా నెల్లిమర్ల‌లో ఆదివారం రాత్రి జరిగింది. యువతి ఆర్తనాదాలను విన్న ఓ వ్యక్తి బాధితురాలిని ఆస్పత్రికి తరలించి, పోలీసులకు సమాచారం అందించాడు.పూసపాటిరేగకు చెందిన యువతి పూల్‌బాగ్‌లో ఉంటున్న తన అక్క ఇంటికి ఆదివారం రాత్రి బయలుదేరింది. పట్టణంలోని కోట కూడలి వద్ద రాత్రి 8 గంటల సమయంలో ఆటో ఎక్కింది. పూల్‌బాగ్‌లోని అటవీశాఖ కార్యాలయం వద్ద ఆమె దిగాల్సి ఉండగా ఆటో డ్రైవర్ ఆపలేదు. ఆ సమయంలో యువతి ప్రతిఘటించగా డ్రైవర్‌తో పాటు ఉన్న మరో ఇద్దరు నోరు నొక్కారు. అక్కడి నుంచి నెల్లిమర్ల పోలీసుస్టేషన్ పరిధిలోని డీటీసీ రోడ్డు పక్కన చెట్ల పొదల్లోకి తీసుకుపోయి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ సమయంలో యువతి కేకలు విన్న ఓ వ్యక్తి అటుగా రావటంతో నిందితులు  అతన్ని చూసి పారిపోయారు. ఆ వ్యక్తి సహయంతో ఇంటికి చేరిన బాధితురాలిని బంధువులు ఆస్పత్రికి తరలించారు. జరిగిన ఘటనపై నెల్లిమర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎస్సీ, ఎస్టీ, అత్యాచారం కింద కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు. వారిని కఠినంగా శిక్షించాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.