రూ. 999కే స్మార్ట్ ఫోన్ - MicTv.in - Telugu News
mictv telugu

రూ. 999కే స్మార్ట్ ఫోన్

October 24, 2017

టెలికాం రంగంలో ఇప్పుడు తీవ్ర పోటీ నెలకొని వుంది. రిలయన్స్ జియో 4జీ బేసిక్ ఫీచర్‌ రాకతో అది ఇంకా ఎక్కువైందనే చెప్పుకోవచ్చు. తాజాగా వొడాఫోన్ ఈ తరహా ఎంట్రీ లెవల్ 4జీ ఫోన్ల విక్రయాలపై దృష్టి సారిస్తోంది. ఇప్పటికే ఎయిర్‌టెల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ తక్కువ ధరకే ఫోన్‌లను తీసుకొచ్చేందుకు సర్వం సిద్ధం చేసుకున్నాయి. అది కేవలం రూ.999కే ఈ ఫోన్‌ను అందించనుంది.

ఇందులో మైక్రోమ్యాక్స్‌తో కలిసి ‘ భారత్ 2 అల్ట్రా ’ పేరుతో 4జీతో పనిచేసే స్మార్ట్ ఫోన్‌ను తీసుకువచ్చే యోచనలో వుంది. దీని ధర రూ.2899 కాగా, 36 నెలల తర్వాత వొడాఫోన్‌ రూ.1,900 తిరిగి వినియోగదారుడికి చెల్లించనుంది. ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా అదే మైక్రోమ్యాక్స్‌తో కలిసి ‘ భారత్ 1 ’ 4జీ ఫీచర్‌ను తీసుకొస్తోంది. అలాగే కార్బన్‌తో కలిసి

ఎయిర్‌టెల్‌ 4జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. వొడాఫోన్ కూడా త్వరలోనే భారత్ 2 అల్ట్రా ఫోన్‌ను త్వరలోనే మార్కెట్లోకి తీసుకురానున్నది.

మైక్రోమ్యాక్స్‌ భారత్‌ – 2 అల్ట్రా ఫీచర్లు

* 4 అంగుళాల స్క్రీన్

* 4జీబీ మెమొరీ

* ఆండ్రాయిడ్‌ 6.0

* 1.3 గిగాహెడ్జ్‌ ప్రాసెసర్‌

* 1300 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం

* 2 మెగాపిక్సెల్‌ బ్యాక్ కెమెరా,

* 0.3 మెగాపిక్సెల్‌ ఫ్రంట్ కెమెరా

* 512 ఎంబీ ర్యామ్‌