రూ.179 కే అన్నీ ఇస్తాం..కానీ షరతులు వర్తిస్తాయి!   - MicTv.in - Telugu News
mictv telugu

రూ.179 కే అన్నీ ఇస్తాం..కానీ షరతులు వర్తిస్తాయి!  

December 14, 2017

టెలికాం సంస్థల మధ్య తీవ్రమైన పోటీ ఏర్పడడంతో రోజు రోజుకు వినియోగదారులకు ఆయా టెలికాం సంస్థలు భారీ ఆపర్లును ప్రకటిస్తున్నాయి. తాజాగా వొడాఫోన్ కూడా తమ వినియోగదారులకు కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. రూ. 179 ప్రీపెయిడ్  ఆఫర్‌లో భాగంగా వినియోగదారులకు ఆన్‌లిమిటెడ్ డేటా,కాల్స్ ఇస్తుంది. 28 రోజుల వ్యాలీడిటీ ఉంటుంది.  ప్రస్తుతం ఈ ఆఫర్ బీహర్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఉంది.ఈ ఆఫర్‌లో కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆన్‌లిమిటెడ్ డేటా వస్తుంది. కాని కేవలం 2జీ డేటా మాత్రమే. 3జీ లేదా4జీ రాదు. ఇక కాల్స్ విషయానికి వస్తే  రోజుకు గరిష్టంగా 250 నిమిషాలు, వారాని వెయ్యి నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ప్రతి నిమిషానికి 30 పైసలు వసూలు చేస్తోంది. ఇక వ్యాలీటిడి సమయంలో గరిష్టంగా 300 నంబర్లకు మాత్రమే కాల్స్ చేసుకోవచ్చు. ఈ పరిమితి దాటితే ఒక్కో నంబర్ కు  నిమిషానికి 30 పైసలు వసూలు చేస్తోంది.