వారం ఆఫర్‌తో వొడాఫోన్ - MicTv.in - Telugu News
mictv telugu

వారం ఆఫర్‌తో వొడాఫోన్

October 28, 2017

వొడాఫోన్ సరికొత్త ఆఫర్లతో వినియోగదారుల మతులు పోగొడుతున్నది. జియో నష్టాలను పూడ్చటానికి రేట్లను పెంచిందే తడవుగా వొడాఫోన్ కొత్త కొత్త ఆఫర్లతో వినియోగదారులను అలరిస్తోంది. ఈ క్రమంలో నెలల ఆఫర్లకు ధీటుగా వారాల ఆఫర్‌ను ప్రవేశ పెట్టింది.  

అదే సూపర్‌వీక్‌ ప్లాన్‌. ఈ ఆఫ‌ర్లో రూ.69తో రీచార్జ్ చేసుకుంటే అపరిమిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌ను, 500 ఎంబీ డేటాను వారం రోజుల పాటు పొందవచ్చు.  వారానికి ఒకసారి దీన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది.

వొడాఫోన్ కష్టమర్లకు మంచి సర్వీస్ అందించడమే మా లక్ష్యమని వొడాఫోన్‌ ఇండియా కన్జ్యూమర్‌ బిజినెస్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ అవనీష్‌ ఖోస్లా తెలిపారు. ఈ ప్యాక్‌ను రిటైల్‌ అవుట్‌లెట్లు, యూఎస్‌ఎస్‌డీ, వెబ్‌సైట్‌, మైవొడాఫోన్‌ యాప్‌ ద్వారా పొందవచ్చని కంపెనీ తెలిపింది.