ఈ దివ్యాంగుడిని చూసైనా ఓటేయాలి.. ఫోటో వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

ఈ దివ్యాంగుడిని చూసైనా ఓటేయాలి.. ఫోటో వైరల్

December 7, 2018

తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఓ దివ్యాంగుడి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. రెండు చేతులూ లేని దివ్యాంగుడే వచ్చి ఓటు వేసి ఓటు విలువను చాటాడని, మీరు కూడా ఓటు వేయండి అంటూ పిలుపునిస్తూ అతని ఫోటోను షేర్ చేస్తున్నారు.

మన దేశంలో సగటున 30 నుంచి 40 శాతమంది ఓటు హక్కును వినియోగించుకోరు. అలాంటి వారిలో చలనం కల్పించడానికి ఈ ఫోటోను విస్తృతంగా షేర్లు చేస్తున్నారు. ఆ ఫోటోలోని దివ్యాంగుడి పేరు విక్రమ్ అగ్నిహోత్రి. మధ్యప్రదేశ్‌‌కు చెందిన 47 ఏళ్ల విక్రమ్ అగ్నిహోత్రికి రెండు చేతులు లేకపోయినప్పటికీ కాళ్లతో కార్లు నడుపుతాడు. ఈ ఫోటో ఇప్పటిది కాదు నాలుగున్నరేళ్ల క్రింతంది.

అతను 2014 లోక్సభ ఎన్నికల్లో ఓటు వేశాడు. ఓటు వేసేందుకు వచ్చిన అతని కాలికి ఎన్నికల సిబ్బంది సిరా గుర్తు వేస్తున్న ఫోటో అప్పుడు యావత్ దేశాన్నే ఆకర్షించింది. ఆ ఫోటోను చాలా మంది ప్రముఖులు షేర్ చేసి ఓటు ఔన్యత్యాన్ని తెలిపారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అప్పట్లో విక్రమ్ అగ్నిహోత్రి ఫోటోను తన ట్విటర్లో పోస్ట్ చేశారు.

ప్రతీ ఎన్నికల్లో 30-40% మంది ఓటుహక్కు వినియోగించుకోరు. 2014లో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో 72 శాతం మంది మాత్రమే ఓట్లు వేశారు. మిగతా 28 శాతం మంది తమ ఓటుహక్కును వినియోగించుకోలేదు. ఈ క్రమంలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం కూడా చర్యలు తీసుకుంటోంది.

Telugu news Vote for a handicaped person to vote … Photo viral